ఆర్గానిక్ మ్యాప్స్: ఆఫ్‌లైన్ హైక్, బైక్, ట్రైల్స్ మరియు నావిగేషన్
Organic Maps అనేది హైకింగ్, సైక్లింగ్ మరియు డ్రైవింగ్ కోసం గోప్యత-కేంద్రీకృత ఆఫ్‌లైన్ మ్యాప్స్ & GPS యాప్. పూర్తిగా ఉచితం. ప్రకటనలు ఉండవు. మిమ్మల్ని ట్రాక్ చేయదు. ఓపెన్-సోర్స్ కమ్యూనిటీ మరియు MapsWithMe/Maps.Me యాప్ వ్యవస్థాపకుల ద్వారా ప్రేమతో అభివృద్ధి చేయబడింది. OpenStreetMap డేటా ద్వారా శక్తివంతం చేయబడింది.
ఈరోజుల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా 100% లక్షణాలను మద్దతు చేసే ఏకైక అప్లికేషన్ ఒక్క ఓర్గానిక్ మ్యాప్స్ మాత్రమే. ఓర్గానిక్ మ్యాప్స్ ఇన్స్టాల్ చేసి, మ్యాప్‌లను డౌన్లోడ్ చేస్కోని మీ సిమ్ కార్డును విసిరేయండి ( మీ ఆపరేటర్ నిరంతరం మిమ్మల్ని ఎలానో ట్రాక్ చేస్తుంది అనుకోండి ).ఇప్పుడు ఒక్క బైట్ కూడా నెట్వర్క్ కి పంపకుండా సింగల్ బాటరీ ఛార్జింగ్ తో వారంపాటు విహారయాత్రకు నిచ్చతింగా వెళ్లి రండి.
డిసెంబర్ 2025లో, ఆర్గానిక్ మ్యాప్స్ 60 లక్షల ఇన్‌స్టాల్‌లను చేరుకుంది. స్కేల్ చేయడానికి మాకు సహాయం చేయండి!
AppStore, Google Play, FDroid, Huawei AppGallery నుండి ఓర్గానిక్ మ్యాప్స్ ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి.
ప్రేగ్ పట్నం
ఆఫ్‌లైన్ సెర్చ్
డార్క్ మోడ్‌లో నావిగేషన్
ఫీచర్స్
పర్యాటకులకు, హైకర్లు మరియు సైకిలిస్టులకు క్రింది ఫీచర్ల చే ఈ "ఓర్గానిక్ మ్యాప్స్" అత్యంత మైత్రిగల యాప్ గా మారింది:
- ఇతర మ్యాప్‌లలో లేని ప్రాంతాలను వివరసమృద్ధ ఆఫ్‌లైన్ మ్యాప్‌లుగా అందిస్తుంది, [ఓపెన్‌స్ట్రీట్‌మ్యాప్]కు ధన్యవాదాలు.
- సైక్లింగ్ దారులను, హైకింగ్ మార్గాలు, మరియు నడిచే త్రోవలను
- కౌంటర్ లైన్లు, ఎలివేషన్ ప్రొఫైల్‌లు, పర్వతాలు, మరియు పర్వత చోటులను చూపిస్తుంది.
- ఆడియో గైడెన్స్ మరియు ఆండ్రాయిడ్ ఆటోతో వాకింగ్, సైక్లింగ్ మరియు కార్ నావిగేషన్ చేయండి
- మెట్రో మ్యాప్స్
- వేగవంతమైన ఆఫ్ లైన్ సెర్చ్ .
- KML, KMZ, GPX ఫార్మాట్లలో బుక్మార్క్లు మరియు ట్రాక్‌లు, GeoJSON
- మీ కళ్ళను సంరక్షించడానికి డార్క్ మోడ్ ఆప్షన్ ఉంది.
- దేశాలు, ప్రాంతాలు పెద్దగా స్టోరేజ్ తీసుకోవు
- ప్రసిద్ధ ప్రదేశాల కోసం వికీపీడియా వ్యాసాలు
- ఈ యాప్ పూర్తిగా ఉచితం మరియు ఓపెన్-సోర్స్ .
ఆర్గానిక్ మ్యాపులే ఎందుకు ?
"ఆర్గానిక్ మ్యాప్స్"స్వచ్ఛమైనది .ఇది ప్రేమతో తయారు చేయపడినది.
- మీ గోప్యతను గౌరవిస్తాది
- మీ బ్యాటరీని సేవ్ చేస్తుంది.
- అనవసరమైన డేటా చార్జీలు ఉండవు.
"ఆర్గానిక్ మ్యాప్స్" యాప్ ట్రాకర్లు మరియు ఇతర దుష్ట పద్ధతులు నుండి స్వేచ్ఛగా ఉంటాది.
- ప్రకటనలు ఉండవు
- మిమ్మల్ని ట్రాక్ చేయదు
- డేటా సేకరణలు ఉండవు
- No phoning home
- అసహజమైన నమోదులు ఉండవు
- అనివార్యమైన ట్యుటోరియల్లు ఉండవు
- ఇమెయిలు స్పామ్ ఉండవు
- పుష్ నోటిఫికేషన్లు లేవు
- అనవశ్యకమైన సాఫ్ట్వేర్ ఉండదు
- ఇది పూర్తిగా స్వచ్ఛమైనది !!
ఈ అప్లికేషన్ ఎక్సోడస్ ప్రైవసీ ప్రాజెక్ట్ ద్వారా ధృవీకరించబడింది.
iOS అనువర్తనం TrackerControl for iOS ద్వారా ధృవీకరించబడింది.
ఆర్గానిక్ మప్స్ మీ మొయిద నిఘా ఉంచాడనికి అనవసరమైన అనుమతులు అడగదు
ఈ ఆర్గానిక్ మప్స్ లో , మేము మీ గోప్యతను ప్రాధమిక హక్కుగా భావిస్తాము .
- ఆర్గానిక్ మ్యాప్స్ ఒక ఇండి కమ్యూనిటీ-నియోజిత ఓపెన్-సోర్స్ ప్రాజెక్ట్.
- పెద్ద టెక్ సంస్థల కళ్ళు నుండి మీ గోప్యతను మేము రక్షిస్తాము.
- మీరు ఎక్కడ ఉన్న సురక్షితంగా ఉండండి.
పరివీక్షణను తిరస్కరించండి - మీ స్వాత్రంత్యాన్ని స్వాగతించండి
ఆర్గానిక్ మ్యాప్స్ ని ఒకసారి ప్రయత్నించండి!
మరి ఈ ఉచిత అనువర్తనానికి ఎవరు చెల్లిస్తున్నారు?
ఈ అనువర్తనం అందరికీ ఉచితం. మాకు తోడ్పడేందుకు [విరాళం] (@/donate/index.te.md) ఇవ్వండి!
సులభంగా విరాళం ఇచ్చేందుకు, మీకు నచ్చిన చెల్లింపు విధానం యొక్క ఐకాన్ పై నొక్కండి:
దిగువన ఉన్న సంస్థాగత స్పాన్సర్లు కొన్ని మౌలిక సదుపాయాల ఖర్చులను కవర్ చేయడానికి మరియు ఎంచుకున్న కొత్త ఫీచర్ల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి లక్ష్య గ్రాంట్లను అందించారు:
|
|
శోధన మరియు మూలాల మెరుగుదల ప్రాజెక్ట్ NGI0 ఎంట్రస్ట్ ఫండ్ ద్వారా నిధులు సమకూర్చబడింది. NGI0 ఎంట్రస్ట్ ఫండ్ NLnet ఫౌండేషన్ ద్వారా స్థాపించబడింది, ఇది యూరోపియన్ కమిషన్ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నెట్ ప్రోగ్రామ్ నుండి ఆర్థిక సహాయంతో, గ్రాంట్ ఒప్పందం నం 101069594 కింద DG కమ్యూనికేషన్స్ నెట్వర్క్స్, కంటెంట్ మరియు టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉంది. |
|
|
Google 2022, 2023, 2024, 2025 ప్రోగ్రామ్‌ల సమయంలో Google సమ్మర్ ఆఫ్ కోడ్ ప్రోగ్రామ్‌లో విద్యార్థి ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇచ్చింది. ఆండ్రాయిడ్ ఆటో, వికీపీడియా డంప్ ఎక్స్ట్రాక్టర్, ఆండ్రాయిడ్ ట్రాక్ రికార్డింగ్ వంటి ముఖ్యమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. |
|
ISP Mythic Beasts మ్యాప్ డౌన్లోడ్లు మరియు అప్డేట్లను హోస్ట్ చేయడానికి మరియు అందించడానికి 400 TB/నెల వరకు ఉచిత బ్యాండ్‌విడ్త్‌తో రెండు వర్చువల్ సర్వర్లను మాకు అందిస్తుంది. |
|
|
44+ Technologies వియత్నాం మరియు ఆగ్నేయాసియాలో మ్యాప్‌లను అందించడానికి సంవత్సరానికి సుమారు $12,000 విలువైన ఉచిత డెడికేటెడ్ సర్వర్‌ను మాకు అందిస్తుంది. |
|
|
FUTO ఫిబ్రవరి 2023లో ఆర్గానిక్ మ్యాప్స్‌కు $1000 మైక్రో-గ్రాంట్‌ను మంజూరు చేసింది. |
సంఘం
ఆర్గానిక్ మ్యాప్స్, అపాచీ లైసెన్స్ 2.0 గల ఒక స్వేచ్ఛామూలాలు సాఫ్ట్వేర్.
- మా బీటా ప్రోగ్రామ్ లో చేరి, మీ సూచనలు, తప్పులను నివేదించండి:
- బగ్ లు, లేదా సమస్యలను మాకు ఇస్స్యూ ట్రాకర్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజెయ్యండి.
- కొత్త అలోచనలు చర్చించండి, ఫీచర్లు ప్రతిపాదించండి.
- వార్తల కొరకు మా టెలీగ్రామ్ చానెల్ లేదా మ్యాట్రిక్స్ స్పేస్ కి సబ్ స్క్రైబ్ అవ్వండి.
- ఇతర వినియోగదారులతో చర్చించడానికి మా టెలీగ్రామ్ సమూహంలో చేరండి.
- మా గిట్ హబ్ పేజీని సందర్సించండి.
- ఫోస్టోడాన్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, Bluesky, Threads, రెడ్డిట్, లింకిడిన్, TikTok లో మమ్మల్ని ఫాలో అవ్వండి.
- స్థానిక కమ్యూనిటీలలో చేరండి (లేదా సృష్టించి మాకు తెలియజేయండి): Hungarian Matrix room, Chinese-, French-, Russian-, Turkish-speaking Telegram chats.
