Organic Maps: ఆఫ్‌లైన్ హైక్, బైక్, ట్రైల్స్ మరియు నావిగేషన్
Organic Maps అనేది గోప్యతకు ప్రాధాన్యమిచ్చే ఆఫ్‌లైన్ మ్యాప్‌ల యాప్. హైకింగ్, సైక్లింగ్, పరుగు, డ్రైవింగ్ కోసం GPS నావిగేషన్, ట్రాక్ రికార్డింగ్, మార్గాల ప్రణాళికను అందిస్తుంది. పూర్తిగా ఉచితం. ప్రకటనలు లేవు. మీపై నిఘా ఉండదు. ఓపెన్-సోర్స్ కమ్యూనిటీతో పాటు MapsWithMe/Maps.Me యాప్‌ను రూపొందించిన వారే దీనిని ప్రేమతో అభివృద్ధి చేశారు. OpenStreetMap డేటా ఆధారంగా పనిచేస్తుంది.
మ్యాప్‌లను డౌన్‌లోడ్ చేసిన తర్వాత Organic Maps మీకు ప్రదేశాలను శోధించడానికి, మార్గాలను ప్లాన్ చేసుకోవడానికి, GPS ట్రాక్‌లను రికార్డ్ చేయడానికి, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా దారి తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. మొబైల్ డేటా లేదా రోమింగ్ ఛార్జీలు లేకుండా దూరప్రాంతాల్లోని కాలిబాటలను అన్వేషించండి లేదా విదేశాలకు ప్రయాణించండి.
2026 అక్టోబర్‌లో Organic Maps ఇన్‌స్టాల్‌ల సంఖ్య 12 మిలియన్లు దాటింది. మరింత ఎదగడానికి మాకు సహాయం చేయండి!
AppStore, Google Play, FDroid, Huawei AppGallery, Obtainium, Accrescent నుండి Organic Maps ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.




ఫీచర్స్
Organic Mapsతో ప్రయాణాలను ప్లాన్ చేసుకోండి, దారి తెలుసుకోండి, కొత్త ప్రదేశాలను అన్వేషించండి:
- OpenStreetMapకు ధన్యవాదాలు, ఇతర మ్యాప్‌లలో లేని ప్రదేశాలను కూడా చూపించే వివరమైన ఆఫ్‌లైన్ మ్యాప్‌లు
- ప్రత్యక్ష గణాంకాలతో GPS ట్రాక్ రికార్డింగ్
- స్టాప్ల క్రమాన్ని స్వయంచాలకంగా మెరుగుపరిచే బహుళ స్టాప్‌లతో మార్గాల ప్రణాళిక
- వేగవంతమైన మరియు అతి తక్కువ దూర మార్గాల మధ్య ఎంచుకోండి
- నడక, సైక్లింగ్, కారు ప్రయాణాల కోసం ప్రతి మలుపు వద్ద వాయిస్ సూచనలతో నావిగేషన్, CarPlay/Android Auto మద్దతు
- బస్సు, ట్రామ్, మెట్రో, లైట్ రైల్ కోసం ప్రజా రవాణా మార్గాల ప్రణాళిక
- డౌన్‌లోడ్ చేసిన మ్యాప్‌లలో వేగవంతమైన ఆఫ్‌లైన్ శోధన
- హైకింగ్, సైక్లింగ్, మరియు మౌంటెన్-బైక్ మార్గాల పొరలు
- కాలిబాటలు, క్యాంపింగ్ ప్రదేశాలు, గుడిసెలు, ఆశ్రయాలు, నీటి వనరులను ప్రత్యేకంగా చూపించే బహిరంగ కార్యకలాపాల మ్యాప్ శైలి
- సమోన్నత రేఖలు, శిఖరాలు, వాలులు, అలాగే ఎత్తు సమాచారం ఉన్న మార్గాలు, ట్రాక్‌ల ఎత్తు ప్రొఫైల్‌లు
- భవిష్యత్ ప్రయాణాల కోసం ప్రణాళికాబద్ధ మార్గాలను సేవ్ చేసుకోండి
- KML/KMZ, GPX, GeoJSON ఫార్మాట్లలో బుక్మార్క్లు, GPS ట్రాక్‌లను దిగుమతి చేయండి, ఎగుమతి చేయండి, పంచుకోండి
- Google Takeoutలోని
Saved Places.jsonఫైల్ నుంచి Google Mapsలో సేవ్ చేసిన ప్రదేశాలను దిగుమతి చేసుకోండి - iCloud బ్యాకప్, సమకాలీకరణ (iOS)
- OpenStreetMapలో నేరుగా ప్రదేశాలను జోడించండి, సవరించండి
- రూలర్ సాధనంతో సరళరేఖ దూరాలను కొలవండి
- మీ కళ్లను రక్షించే డార్క్ మోడ్
- ప్రసిద్ధ ప్రదేశాల కోసం వికీపీడియా వ్యాసాలు
- మీరు ఇచ్చే టైల్ సర్వర్ URLతో ప్రయోగాత్మక ఉపగ్రహ చిత్రాలు
- పూర్తిగా ఉచితం, ఓపెన్-సోర్స్
Organic Maps ఎందుకు ?
Organic Maps స్వచ్ఛమైనది .ఇది ప్రేమతో తయారు చేయపడినది.
- మీ గోప్యతను గౌరవిస్తాది
- మీ బ్యాటరీని సేవ్ చేస్తుంది.
- అనవసరమైన డేటా చార్జీలు ఉండవు.
Organic Maps యాప్ ట్రాకర్‌లు మరియు ఇతర దుష్ట పద్ధతులు నుండి స్వేచ్ఛగా ఉంటాది.
- ప్రకటనలు ఉండవు
- మిమ్మల్ని ట్రాక్ చేయదు
- డేటా సేకరణలు ఉండవు
- అసహజమైన నమోదులు ఉండవు
- అనివార్యమైన ట్యుటోరియల్లు ఉండవు
- ఇమెయిలు స్పామ్ ఉండవు
- పుష్ నోటిఫికేషన్లు లేవు
- అనవశ్యకమైన సాఫ్ట్‌వేర్ ఉండదు
పురుగుమందులు లేవుపూర్తిగా సేంద్రియం!
ఈ అప్లికేషన్ ఎక్సోడస్ ప్రైవసీ ప్రాజెక్ట్ ద్వారా ధృవీకరించబడింది.
iOS అనువర్తనం TrackerControl for iOS ద్వారా ధృవీకరించబడింది.
Organic Maps మీ మొయిద నిఘా ఉంచాడనికి అనవసరమైన అనుమతులు అడగదు
ఈ Organic Maps లో , మేము మీ గోప్యతను ప్రాధమిక హక్కుగా భావిస్తాము .
- Organic Maps ఒక ఇండి కమ్యూనిటీ-నియోజిత ఓపెన్-సోర్స్ ప్రాజెక్ట్.
- పెద్ద టెక్ సంస్థల కళ్ళు నుండి మీ గోప్యతను మేము రక్షిస్తాము.
- మీరు ఎక్కడ ఉన్న సురక్షితంగా ఉండండి.
పరివీక్షణను తిరస్కరించండి - మీ స్వాత్రంత్యాన్ని స్వాగతించండి
Organic Maps ని ఒకసారి ప్రయత్నించండి!
మరి ఈ ఉచిత అనువర్తనానికి ఎవరు చెల్లిస్తున్నారు?
ఈ అనువర్తనం అందరికీ ఉచితం. మాకు తోడ్పడేందుకు విరాళం ఇవ్వండి!
సులభంగా విరాళం ఇచ్చేందుకు, మీకు నచ్చిన చెల్లింపు విధానం యొక్క ఐకాన్ పై నొక్కండి:
దిగువన ఉన్న సంస్థాగత స్పాన్సర్‌లు కొన్ని మౌలిక సదుపాయాల ఖర్చులను కవర్ చేయడానికి మరియు ఎంచుకున్న కొత్త ఫీచర్‌ల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి లక్ష్య గ్రాంట్‌లను అందించారు:
|
|
శోధన మరియు మూలాల మెరుగుదల ప్రాజెక్ట్ NGI0 ఎంట్రస్ట్ ఫండ్ ద్వారా నిధులు సమకూర్చబడింది. NGI0 ఎంట్రస్ట్ ఫండ్ NLnet ఫౌండేషన్ ద్వారా స్థాపించబడింది, ఇది యూరోపియన్ కమిషన్ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నెట్ ప్రోగ్రామ్ నుండి ఆర్థిక సహాయంతో, గ్రాంట్ ఒప్పందం నం 101069594 కింద DG కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్స్, కంటెంట్ మరియు టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉంది. |
|
|
Google 2022, 2023, 2024, 2025 ప్రోగ్రామ్‌ల సమయంలో Google సమ్మర్ ఆఫ్ కోడ్ ప్రోగ్రామ్‌లో విద్యార్థి ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇచ్చింది. ఆండ్రాయిడ్ ఆటో, వికీపీడియా డంప్ ఎక్స్‌ట్రాక్టర్, ఆండ్రాయిడ్ ట్రాక్ రికార్డింగ్ వంటి ముఖ్యమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. |
|
ISP Mythic Beasts మ్యాప్ డౌన్‌లోడ్‌లు మరియు అప్‌డేట్‌లను హోస్ట్ చేయడానికి మరియు అందించడానికి 400 TB/నెల వరకు ఉచిత బ్యాండ్‌విడ్త్‌తో రెండు వర్చువల్ సర్వర్‌లను మాకు అందిస్తుంది. |
|
|
FUTO ఫిబ్రవరి 2023లో Organic Maps కు $1000 మైక్రో-గ్రాంట్‌ను మంజూరు చేసింది. |
సంఘం
Organic Maps, అపాచీ లైసెన్స్ 2.0 గల ఒక స్వేచ్ఛామూలాలు సాఫ్ట్‌వేర్.
- కొత్త ఫీచర్లను ప్రయత్నించడానికి, మెరుగుదలలను సూచించడానికి, బగ్‌లను నివేదించడానికి మా బీటా ప్రోగ్రామ్‌లో చేరండి:
- బగ్ లు, లేదా సమస్యలను మాకు ఇస్స్యూ ట్రాకర్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజెయ్యండి.
- కొత్త అలోచనలు చర్చించండి, ఫీచర్లు ప్రతిపాదించండి.
- వార్తల కొరకు మా టెలీగ్రామ్ చానెల్ లేదా మ్యాట్రిక్స్ స్పేస్ కి సబ్ స్క్రైబ్ అవ్వండి.
- ఇతర వినియోగదారులతో చర్చించడానికి మా టెలీగ్రామ్ సమూహంలో చేరండి.
- మా గిట్ హబ్ పేజీని సందర్సించండి.
- ఫోస్టోడాన్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, Bluesky, Threads, Patreon, YouTube, రెడ్డిట్, లింకిడిన్, TikTok లో మమ్మల్ని ఫాలో అవ్వండి.
