ఎలివేషన్ చార్ట్‌లతో హైకింగ్, సైక్లింగ్ రూట్లు, మరింత తెలివైన US చిరునామా శోధన, యాంటీమెరిడియన్ వద్ద నిరంతర మ్యాప్ స్క్రోలింగ్ ఇంకా ఏప్రిల్ Organic Maps అప్‌డేట్‌లో మరెన్నో

April 7, 2026

ఈ ఏప్రిల్ విడుదలలో, ఎన్నో బగ్ పరిష్కారాలు, మెరుగుదలలతో పాటు, మూడు సరళమైన నిజాలపై మేము దృష్టి పెట్టాము: హైకర్‌లు ముందెంత ఎక్కాల్సి ఉందో తెలుసుకోవాలని కోరుకుంటారు, ప్రతి ఒక్కరూ చిరునామా శోధన సులభంగా పనిచేయాలని ఆశిస్తారు, అలాగే మ్యాప్ అంచు దాటిపోయిన భావన ఎవరికీ కలగకూడదు. మా కాంట్రిబ్యూటర్‌లకు, మీ మంచి సమీక్షలకు, విరాళాలకు, మద్దతుకు ధన్యవాదాలు. వీటి మూడింటినీ మేము మెరుగుపరచగలిగాము, అంతే కాదు ఇంకా చాలా చేశాము.

వసంతం మిమ్మల్ని కొత్త కాలిబాటలపైకి పిలుస్తున్నా, లేదా దక్షిణ అర్ధగోళంలో శరదృతువు చివరి పొడవైన రైడ్ కోసం ఆహ్వానిస్తున్నా, ఈ అప్‌డేట్ మీ తదుపరి ప్రయాణాన్ని కొంచెం సులభంగా, మరింత అందంగా మార్చుతుందని మేము ఆశిస్తున్నాము.

ఏప్రిల్ అప్‌డేట్‌ను https://get.omaps.org లో లేదా App Store, Google Play, Huawei AppGallery, Obtainium, Accrescent, మరియు F-Droid లో పొందండి.

ముఖ్యాంశాలు

విడుదల గమనికలు

అన్ని ప్లాట్‌ఫారమ్‌లు

iOS

పాత iPhone, iPad వాడుకరులకు గమనిక: TestFlight, App Store‌లలో వచ్చిన ఇటీవలి మార్పుల కారణంగా, ఈ విడుదల iOS 15 మరియు ఆ తర్వాతి వెర్షన్‌లకే మద్దతు ఇస్తుంది. iOS 12, 13, 14లకు ఇకపై మద్దతు లేదు. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసిన Organic Maps పాత పరికరాల్లో కొనసాగుతుంది, కానీ కొత్త మ్యాప్‌లు, ఫీచర్లు, పరిష్కారాలు ఇకపై iOS 15 పై ఉన్న పరికరాలకే అందుతాయి.

Android

డెస్క్‌టాప్ (Linux మరియు Mac OS)

ప్రారంభ ఫీచర్‌లను ప్రయత్నించడానికి మరియు సమస్యలను నివేదించడానికి బీటా పరీక్షలో చేరండి:

ప్రేమ మరియు శ్రద్ధతో ❤️ Organic Maps బృందం

వార్తలకు తిరిగి వెళ్ళండి